ఫర్టిలైజర్ దుకాణంలో మంటలు.. భారీ నష్టం
ABN , Publish Date - May 12 , 2024 | 12:13 AM
పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వికారాబాద్ పట్టణంకు చెందిన మధుసూదన్ రెడ్డి కి చెందిన ధనలక్ష్మీ సీడ్స్ పేరుతో ఫర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్నాడు.

వికారాబాద్, మే 11: పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వికారాబాద్ పట్టణంకు చెందిన మధుసూదన్ రెడ్డి కి చెందిన ధనలక్ష్మీ సీడ్స్ పేరుతో ఫర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి షాపులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న విత్తనాలు, ఎరువులు దగ్ధమయ్యాయి. దీంతో దాదాపుగా రూ.కోటి నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.