Share News

ఫర్నిచర్‌ షాపులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:05 AM

పట్టణంలోని చటాన్‌పల్లి రోడ్డులో ఉన్న జేపీ ఫర్నిచర్‌ షాపులో ఆదివారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌ కారణణగా ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

ఫర్నిచర్‌ షాపులో అగ్ని ప్రమాదం

రూ.5లక్షల మేర ఆస్తి నష్టం

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 2: పట్టణంలోని చటాన్‌పల్లి రోడ్డులో ఉన్న జేపీ ఫర్నిచర్‌ షాపులో ఆదివారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్‌ కారణణగా ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో సెల్లార్‌లో కరెంట్‌ బోర్డు నుంచి మంటలు వచ్చి కింద ఉన్న బెడ్లు, ఫర్నీచర్‌పై పడి ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కలవాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కాగా, అగ్నిప్రమాదంలో సుమారు రూ.5లక్షల విలువ గల ఫర్నీచర్‌ కాలిపోయిందని బాధితుడు రహీం తెలిపాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా అతడు కోరాడు.

Updated Date - Jun 03 , 2024 | 12:05 AM