Share News

పండుగలు సంస్కృతికి చిహ్నాలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:09 AM

పండుగలు సంస్కృతికి చిహ్నాలని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి జె.త్రిశూల్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నర్సింహ్మారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు.

పండుగలు సంస్కృతికి చిహ్నాలు
మేడ్చల్‌ టౌన్‌: సంక్రాంతి సంబురాల్లో విద్యార్థులు

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 11: పండుగలు సంస్కృతికి చిహ్నాలని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల కార్యదర్శి జె.త్రిశూల్‌రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నర్సింహ్మారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి త్రిశూల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారి సంస్కృతిని చాటే పండుగల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేశారు. పిండి వంటలు చేసి తీసుకొచ్చారు. యువతులు సంక్రాంతి పాటలపై ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ జె.నర్సింహారెడ్డి, కోశాధికారి త్రిలోక్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లోకనాథం, డీన్‌, టీ.ఎల్‌. రామదాసు, కన్వీనర్‌ శైలజరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:09 AM