రూ.లక్ష విలువైన శ్రీగంధం చెట్టు నరికివేత
ABN , Publish Date - Feb 20 , 2024 | 12:05 AM
మండలంలోని నందివనపర్తిలో కె.జోగిరెడ్డి వ్యవసాయ పొలంలో ఏపుగా పెరిగిన శ్రీ గంధం చెట్టును ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నరికివేసి అపహరించుకెళ్లారు.
యాచారం, ఫిబ్రవరి 19 : మండలంలోని నందివనపర్తిలో కె.జోగిరెడ్డి వ్యవసాయ పొలంలో ఏపుగా పెరిగిన శ్రీ గంధం చెట్టును ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నరికివేసి అపహరించుకెళ్లారు. అదేవిధంగా మరో చెట్టును నరికేసి అక్కడే వదిలివెళ్లారు. దాదాపు రూ.లక్ష విలువైన చెట్టు దుంగలను ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతు జోగిరెడ్డి చెప్పారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.