Share News

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:04 AM

కష్టాల్లోని రైతులను ఆదుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్‌ చేశారు.

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 2 : కష్టాల్లోని రైతులను ఆదుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం సహచర ఎమ్మెల్యేలతో కలిసి కొంగర కలాన్‌లోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలని, రైతు భరోసాను అమలు చేయాలని, రైతులకు 2లక్షల రైతు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కరెంట్‌, నీళ్లు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని, ఇది ప్రకృతి కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు అని తెలిపారు. గత డిసెంబర్‌ 9నే 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, రైతుబంధును పెంచుతాం అని ఎకరాకు 5వేలు కూడా పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. క్వింటాలు ధాన్యానికి 500 బోనస్‌ ఇస్తామని చెప్పారని, వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పిలుపు మేరకు రైతుల సమస్యలపై నిరసన దీక్షలు, ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, యాదయ్య, జడ్పీటీసీ జంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:04 AM