Share News

రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ లక్ష్యం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:01 AM

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం, అధికార సిబ్బంది కలిసి పనిచేస్తామని ఆ సంఘం చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ లక్ష్యం
మాట్లాడుతున్న చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి

బషీరాబాద్‌, మార్చి 28: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం, అధికార సిబ్బంది కలిసి పనిచేస్తామని ఆ సంఘం చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి అన్నారు. సొసైటీ ద్వారా లావాదేవీలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలతో రూ.28లక్షల లాభాల బాటలో సొసైటీ కొనసాగుతుందన్నారు. నవాంద్గీ సొసైటీ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ సీఈవో బందెయ్యగౌడ్‌ లావాదేవీలకు సంబంధించిన లెక్కలను చదివి వినిపించారు. అనంతరం చైర్మన్‌ ఆధ్వర్యంలో పాలకవర్గం సొసైటీ ఆర్థిక వనరులు, పంట, దీర్ఘకాలిక రుణ బకాయిల వసూళ్లు, రుణాల మంజూరు తదితర ఆంశాలపై సమీక్షిస్తూ సమావేశంలో చర్చించారు. సొసైటీ ద్వారా రూ.8కోట్ల 34లక్షల 46వేల 237 రైతులకు పంట రుణాలు ఇవ్వనున్నట్లు చైర్మన్‌ వివరించారు. అదేవిధంగా సొసైటీ ద్వారా దీర్ఘకాలిక రుణాలు రూ.76లక్షల 38వేల 100 ఇచ్చామన్నారు. ఇకపై సొసైటీ ద్వారా తులానికి రూ.45వేల రుణం ఇచ్చేందుకు పాలక వర్గ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. రూ.2కోట్లతో సొసైటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైసుమిల్లు, గోదాం పనులు దాదాపు పూర్తికావచ్చాయన్నారు. ప్రస్తుత సొసైటీ కార్యాలయం పక్కన పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చి, అక్కడా గోదాం నిర్మాణానికి తీర్మానించా మన్నారు.ఈ ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులతో గోదాం నిర్మాణానికి అంచనా వ్యయం లెక్కలేసి పంపించామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఆశోక్‌ గౌతంచంద్ర, హన్మంత్‌రెడ్డి, రంగారెడ్డి, నవీన్‌రెడ్డి, రూప్లానాయక్‌, గోపాల్‌, అనసూయబాయి, కార్యాలయ అధికార సిబ్బందిరాజశేఖర్‌, ఫారుఖ్‌, తుకారం పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:01 AM