Share News

తక్షణమే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయాలి

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:02 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని, తక్షణమే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. రైతులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. శనివారం బీఆర్‌ఎస్‌ నాయకులు రైతు దీక్షలు నిర్వహించారు.

తక్షణమే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయాలి
నిరసనలో పాల్గొని మాట్లాడుతున్న సబితారెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్‌ 6 : కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని, తక్షణమే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. రైతులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. శనివారం బీఆర్‌ఎస్‌ నాయకులు రైతు దీక్షలు నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన నిర్వహించిన నిరసనలో సబిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ధాన్యం మద్దతు ధరకు బోనస్‌గా రూ.500 చెల్లించాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల ఆర్థికసాయం, మృతిచెందిన రైతుల కుంటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందించాలని, 24 గంటల కరెంట్‌ ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డి రైతులు, ప్రజా సమస్యల వదలిపెట్టి ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, షాబాద్‌, మొయినాబాద్‌ జెడ్పీటీసీలు అవినా్‌షరెడ్డి, శ్రీకాంత్‌, మండలాధ్యక్షులు ప్రభాకర్‌, నర్సింగ్‌రావు, గోపాల్‌, సీనియర్‌ నాయకులు అనంత్‌రెడ్డితో పాటు యాదగిరి, చంద్రశేఖర్‌, సాయినాథ్‌, బి.నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 01:02 AM