Share News

గుర్తుతెలియని వాహనం ఢీకొని రైతు మృతి

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:14 AM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన బషీరాబాద్‌-తాండూరు ప్రధాన రోడ్డుమార్గంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని రైతు మృతి

బషీరాబాద్‌, మార్చి 7: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన బషీరాబాద్‌-తాండూరు ప్రధాన రోడ్డుమార్గంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బిచ్చం రాములు(50) మధ్యాహ్నం తాండూరుకు పంట ఎరువుల కోసం వెళ్లాడు. రాత్రి 8.30గంటలకు బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపించారు. అనంతరం మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - Mar 08 , 2024 | 12:14 AM