Share News

బెదిరించి డబ్బులు వసూలు.. కేసు నమోదు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:00 AM

నవాబుపేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓఅంగన్‌వాడీ టీచర్‌ను, అదేవిధంగా ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ను ఓ పత్రిక జిల్లా స్టాప్‌రిపోర్టర్‌ అని(ఆంధ్రజ్యోతి కాదు) చెప్పి బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

బెదిరించి డబ్బులు వసూలు.. కేసు నమోదు

వికారాబాద్‌, ఫిబ్రవరి 29: నవాబుపేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓఅంగన్‌వాడీ టీచర్‌ను, అదేవిధంగా ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ను ఓ పత్రిక జిల్లా స్టాప్‌రిపోర్టర్‌ అని(ఆంధ్రజ్యోతి కాదు) చెప్పి బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే వికారాబాద్‌ జిల్లా పరిగిలో సైతం గతంలో ఇలాగే డబ్బులు వసూలు చేసిన రిపోర్టర్లపై ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వికారాబాద్‌ జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి విచ్చలవిడిగా ఈపేపర్లు, యూట్యూబ్‌ ఛానళ్లు పుట్టుకరావడం కేవలం డబ్బులు వసూలే పరమావధిగా మారి కొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 01 , 2024 | 12:00 AM