Share News

ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే : కలెక్టర్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:03 AM

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య కోసం పాటు పడిన జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే : కలెక్టర్‌
పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 11: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య కోసం పాటు పడిన జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్యను ప్రోత్సహించేందుకు పూలే ఎంతగానో కృషి చేశారని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం హర్షణీయమన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారిలో ఆత్మస్తైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడి సాధికారతకు కృషి చేశారని తెలిపారు. అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, బీసీడీవో కె.ఉపేందర్‌, ఏవో అమరేందర్‌ కృష్ణ, ఏబీసీడీవో భీమరాజు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, కలెక్టరేట్‌, బీసీ వెల్ఫేర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:03 AM