ఎక్సైజ్ దాడులు.. బెల్లం పానకం ధ్వంసం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:37 PM
ఆమనగల్లు ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోని కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, ఆమనగల్లు మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా దాడులు నిర్వహించినట్లు ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు సంయుక్తంగా దాడులు చేశాయి.

ఆమనగల్లు, జూన్ 7: ఆమనగల్లు ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోని కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల, ఆమనగల్లు మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా దాడులు నిర్వహించినట్లు ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు సంయుక్తంగా దాడులు చేశాయి. తలకొండపల్లి మండలం పాతకోట తండా, రేకుల కుంట తండా, పెద్దూరు తండా, సూర్యనాయక్ తండా, హర్యనాయక్ తండా, లక్ష్మీ తండా, కర్కస్ తండాలలో నిర్వహించిన దాడులలో నాలుగు లీటర్ల సారా సీజ్ చేసి కొర్ర రాములును అరెస్ట్ చేయగా కేతావత్ లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు సీఐ వివరించారు. పాతకోట తండాలో 160 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ ఇద్దరిని తలకొండపల్లి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు.