Share News

ఎక్సైజ్‌ దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:04 AM

ఆమనగల్లు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఆదివారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

ఎక్సైజ్‌ దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు

ఆమనగల్లు, జూలై 7: ఆమనగల్లు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఆదివారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గుడుంబా రహిత తెలంగాణలో భాగంగా దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్‌ సీఐ బద్యనాథ్‌ చౌహాన్‌ తెలిపారు. మూడు టీంలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు వివరించారు. కడ్తాల మండలం రావిచెడ్‌ గ్రామ సమీపంలోని గుట్టల్లో 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 12 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకొని రెండు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ వివరించారు. ఒకరిని అరెస్ట్‌ చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ ఎస్సై అరుణ్‌కుమార్‌, సిబ్బంది శంకర్‌, నర్సింహ, బాబు, ఆమని, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:04 AM