Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

భూ సమస్యల దరఖాస్తుల పరిశీలన

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:09 AM

భూ సమస్యలకు సంబందించిన ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందని తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ పేర్కొన్నారు.

 భూ సమస్యల దరఖాస్తుల పరిశీలన
మొయినాబాద్‌: దరఖాస్తులు పరిశీలిస్తున్న ఎమ్మార్వో

మొయినాబాద్‌, మార్చి 2 : భూ సమస్యలకు సంబందించిన ధరణి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందని తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో చాకలిగూడ, కేతిరెడ్డిపల్లి గ్రామాలకు సంబందించిన ధరణి దరఖాస్తులను శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగుతుందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు. మండలంలో వివిధ రకాల భూసమస్యలకు సంబందించిన ధరణి దరఖాస్తులు 2,246 ఉన్నాయని, రైతుల సమక్షంలో వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేతిరెడ్డిపల్లిలో 45 దరఖాస్తులను పరిశీంచారు. అదేవిదంగా చిన్నమంగళారం గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్‌ వినోద్‌ ఆధ్వర్యంలో 36 దరఖాస్తులు పరిశీలించారు. రైతుల పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ చంద్రమౌళి, అక్షయ్‌ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యల పరిష్కరానికే ప్రత్యేక డ్రైవ్‌

కేశంపేట : ధరణి సమస్యల పరిష్కరానికే ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నదని, భూసమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కేశంపేట తహసీల్దార్‌ ఆజాంఅలీ సూచించారు. ధరణి సమస్యల పరిష్కరాం కోసం మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. శనివారం మండల పరిధిలోని బైర్కాన్‌పల్లి, తూర్పు చౌలపల్లి, బొదునంపల్లి, లేమామిడి గ్రామాల్లో ధరణి దరఖాస్తులను పరిశీలించారు. బొదునంపల్లిలో తహసీల్దార్‌ దరఖాస్తులను పరిశీలించారు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు చెప్పారు. దరఖాస్తుల పరీశీలనలో ఆర్‌ఐ నివేదిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:09 AM