Share News

స్ర్టాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:04 AM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీకి తరలించారు. కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య యంత్రాలను స్ర్టాంగ్‌ రూంలో భద్రపర్చారు.

స్ర్టాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు
పాలమూరు యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపర్చిన గది వద్ద అధికారులు

అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ సమక్షంలో పాలమూరు యూనివర్సిటీకి తరలింపు

కొడంగల్‌, మే 14 : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీకి తరలించారు. కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య యంత్రాలను స్ర్టాంగ్‌ రూంలో భద్రపర్చారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ మాట్లాడుతూ ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌లు, పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు, వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులు, మాక్‌పోల్‌ ధ్రువవపత్రాలు, పీవో డైరీ, టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ తదితర ఎన్నికల సామగ్రిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపర్చి తాళాలు వేసి సీల్‌ వేసినట్లు ఆయన తెలిపారు. వారితో పాటు కొడంగల్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:04 AM