ప్రతీ విద్యార్థి లక్ష్యం దిశగా ముందుకెళ్లాలి
ABN , Publish Date - Aug 23 , 2024 | 11:33 PM
ప్రతీ విద్యార్థి తాను నిర్ధేశించుకున్న లక్ష్యందిగా ముందుకెళ్లాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు, మానసిక వైద్య నిపుణులు మనోజ్ అన్నారు.
పెద్దేముల్, ఆగస్టు 23: ప్రతీ విద్యార్థి తాను నిర్ధేశించుకున్న లక్ష్యందిగా ముందుకెళ్లాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బుచ్చిబాబు, మానసిక వైద్య నిపుణులు మనోజ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెంటల్ అండ్ హెల్త్‌స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపైనే దృష్టిపెట్టి లక్ష్యాలు సాధించాలని తెలిపారు. మానసికంగా కుంగుబాటుకు గురికావద్దన్నారు. లక్ష్యం సాధించేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తేలికగా తీసుకోవాలని చెప్పారు. ఒత్తిడికి గురైతే లక్ష్యాలు దూరమవుతాయని సూచించారు. ఒత్తిడి దరిచేరనీయకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మనస్తత్వవేత్త ప్రయా, కృష్ణకాంత్, ఏఎన్‌ఎం వెంకటమ్మ పాల్గొన్నారు.