Share News

లైవ్‌ ప్రాజెక్టులతో సాంకేతిక పరిజ్ఞానం పెంపు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:38 PM

లైవ్‌ ప్రాజెక్ట్‌లతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌ అన్నారు.

లైవ్‌ ప్రాజెక్టులతో సాంకేతిక పరిజ్ఞానం పెంపు
శిక్షణ పొందుతున్న విద్యార్థులు

శామీర్‌పేట, ఫిబ్రవరి 2: లైవ్‌ ప్రాజెక్ట్‌లతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌ అన్నారు. శామీర్‌పేటలోని గురుకుల మహిళ డిగ్రీ కళాశాల్లో శుక్రవారం విద్యార్థులకు ఆన్‌డ్రాయిడ్‌, డేటాసైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ పట్ల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు మిత్‌ ఇట్‌ సోల్యూషన్స్‌ వారు లైవ్‌ ప్రాజెక్ట్‌లపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇలాంటి లైవ్‌ప్రాజెక్ట్‌లతో అవగాహన కలగడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. మిత్‌ ఇట్‌ సొల్యూషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశాల్‌ కుమార్‌లకు ప్రిన్సిపాల్‌, అషధ్యకులు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 11:38 PM