Share News

రోబోటిక్స్‌ రంగంలో ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:00 AM

రోబోటిక్స్‌ రంగంలో మోకానికల్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శివరామకృష్ణ తెలిపారు.

రోబోటిక్స్‌ రంగంలో ఉపాధి అవకాశాలు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 28: రోబోటిక్స్‌ రంగంలో మోకానికల్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శివరామకృష్ణ తెలిపారు. వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో గురువారం జరిగిన రోల్‌ అఫ్‌ అడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఇన్‌ రోబోటిక్స్‌పై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రోబోటిక్స్‌ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. రోబోటిక్స్‌ విభాగంలో అడిటివ్‌ మోకానికల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ విశిష్టతను వివరించారు. ఇలాంటి సెమినార్‌లలో విద్యార్థులు పాల్గొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ మోకానికల్‌ హెచ్‌వోడీ శ్రీనివాస చలపతి, అధ్యాపకులు మదన్‌మోహన్‌, కుమార్‌, రవికాంత్‌, తనుజ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:00 AM