Share News

ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:37 AM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

ఎన్నికల విధులను సజావుగా నిర్వహించాలి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26 : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేశారు. ప్రతీ నియోజకవర్గం వారీగా ఒక టీంను ఏర్పాటుచేసి ఓటరు జాబితా ప్రింట్లను గుర్తించిన రాజకీయ పార్టీల నాయకులకు అందజేయాలన్నారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ చిరునామా కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? చెక్‌ చేసుకోవాలని, ఎన్నికల ప్రచార సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులు జారీ చేయాలన్నారు. ఓటరు స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, ఓటరు సమాచార స్లిప్పులు కుటుంబ సభ్యులకే అందజేసేలా చూడాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, ఫామ్‌-12కు సంబంధించి రెండు రోజుల్లో పూర్తిచేసి కవరింగ్‌ లేటర్లతో రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల ఉద్యోగులకు ఓటరు స్పెషాలిటీ సెంటర్‌ ఏర్పాటుకు ప్లాన్‌ చేయాలని, ప్రిసైడింగ్‌ అధికారులు, ఏపీవోలు, ఓపీవోలకు మాస్టర్‌ డైరీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలని, ఎఫ్‌ఎ్‌సటీ, వీఎ్‌సటీ బృందాలు పకడ్బందీగా పనిచేయాలని, సి-విజల్‌ పర్మిషన్లు తీసుకోవాలని, రాజకీయ పార్టీల వారు వీడియో, ఆడియో కంటెంట్‌కు సంబంధించి పెన్‌డ్రైవ్‌ ఇస్తే చెక్‌చేసి ఎంసీఎంసీ ద్వారా పర్మిషన్‌ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలీకాన్పరెన్స్‌లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌, వాసుచంద్ర, శ్రీనివా్‌సరావు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 10:23 AM