Share News

టీజీవోల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:48 PM

టీజీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు అన్నారు. జిల్లా గెజిటెడ్‌ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు

టీజీవోల సమస్యల పరిష్కారానికి కృషి

సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : టీజీవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు అన్నారు. జిల్లా గెజిటెడ్‌ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో గెజిటెడ్‌ అధికారుల సంఘానికి హాల్‌, పక్కా బిల్డింగ్‌ నిర్మాణం కోసం కలెక్టర్‌ను కలవాలని తీర్మానించారు. సమావేశంలో భాగంగా కొత్తగా ఇద్దరు వైస్‌ ప్రెసిడెంట్లను, నలుగురు జాయింట్‌ సెక్రటరీలను నామినేట్‌ చేశారు. వైస్‌ ప్రెసిడెంట్‌లుగా బాలరాజుగౌడ్‌, గంపా శ్రీనివాస్‌, జాయింట్‌ సెక్రటరీలుగా సైదమ్మ, మహేందర్‌, భూక్యా రాకేష్‌, నాగేశ్వర్‌రావును నియమించారు. ఉద్యోగులకు ఇండ్ల స్థలాల కోసం సొసైటీగా ఏర్పడాలని, డివిజన్‌ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి సంఘాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె. రామారావు, కార్యదర్శి శ్రీనే్‌షకుమార్‌ నోరి, సెంట్రల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రామకృష్ణ, శ్రీరామ్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్‌, రంగారెడ్డి జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశం, ట్రెజరర్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఎన్‌.వెంకట్‌, ఎం.అలివేలు మంగ, రేవతి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణస్వామి, మహేశ్వరి, ఈసీఎం కె. నరేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:48 PM