ఆశాల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:26 PM
ఆశా కార్యకర్తల, రెండో ఏఎన్‌ఎమ్‌ల దీర్ఘకాలిక సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని కళ్యాణి గార్డెన్‌లో మంగళవారం జిల్లా వైద్యారోగ్య ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఆమనగల్లు, ఫిబ్రవరి 6 : ఆశా కార్యకర్తల, రెండో ఏఎన్‌ఎమ్‌ల దీర్ఘకాలిక సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని కళ్యాణి గార్డెన్‌లో మంగళవారం జిల్లా వైద్యారోగ్య ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు క్రమబద్ధీకరించి రూ.26వేలు వేతనం, ఈఎ్‌సఐ, ఉద్యోగభద్రత కల్పించాలని, రూ.10 వేలు పింఛన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని కసిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షల కు పెంచి అమలు చేస్తుందని ఆయన వివరించారు. బీఆర్‌ఎస్ పాలనలో వైద్యరంగంలో కల్వకుర్తి నియోజకవర్గం తీవ్ర వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించకుండా ఇ బ్బందులకు గురి చేసిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఈసీ, ఆర్‌సీహెచ్, హెచ్‌ఆర్‌డీ, ఏఎన్‌ఎంల ను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కోరారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు, పరీక్షిత్, ఎంపీపీ అనితావిజయ్, ఆశాకార్యకర్తల సంఘం నాయకురాళ్లు సరోజ, సల్మా, వెంకటమ్మ, సుజాత, సరోజిని, జ్యోతి, సిబ్బంది, నాయకులు దశరథం, కృష్ణనాయక్, జగన్, రవీందర్‌రెడ్డి, సురే శ్‌నాయక్, ప్రసాద్, బాబా, సురేందర్‌రెడ్డి, భా స్కర్‌రెడ్డి, అలీం, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.