Share News

ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు కృషి

ABN , Publish Date - May 27 , 2024 | 12:02 AM

పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈమేరకు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు అవసరమైతే సాధన సమితి నాయకులతో కలిసి పోరాటానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు కృషి

ఆమనగల్లు, మే 26: పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని, ఈమేరకు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు అవసరమైతే సాధన సమితి నాయకులతో కలిసి పోరాటానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల ప్రజలకు సౌలభ్యంగా ఆమనగల్లు పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని కోరుతూ సాదన సమితి నాయకులు ఆదివారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ను కలిశారు. సాధన సమితి నాయకుడు నేనావత్‌ పత్యనాయక్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్డీవో కార్యాలయం అందుబాటులో లేక నాలుగు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు ఎన్నో వ్యయప్రయాసాలకు లోనవుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆమనగల్లులో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుచేస్తే ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని ప్రవీణ్‌కుమార్‌ సాధన సమితి నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుచేసే వరకు పోరాటం కొనసాగించాలని ఆయన సాధన సమితి నాయకులకు ఆఎస్పీ సూచించారు. సాధన సమితి నాయకుడు డేరంగుల వెంకటేశ్‌, రమేశ్‌ నాయక్‌, గణేశ్‌, మహేందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 12:02 AM