Share News

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:50 PM

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్డీవో, లోక్‌సభ ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి సూరజ్‌కుమార్‌ తెలిపారు.

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి

నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

ఆర్డీవో సూరజ్‌కుమార్‌

కందుకూరు, ఏప్రిల్‌ 25 : లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్డీవో, లోక్‌సభ ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి సూరజ్‌కుమార్‌ తెలిపారు. గురువారం సాయంత్రంలో ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహేశ్వరంలో 5లక్షల 56వేల 741మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఈనెల 15 వరకు ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. నియోజకవర్గ పరిధిలో చనిపోయిన, డబుల్‌ ఓట్లు ఉన్న 10వేల మంది పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. శాసన సభ ఎన్నికల అనంతరం ఓటరు నమోదులో యువత శాతం మరింత పెరిగిందన్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులను ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 537 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా ఎప్పటికప్పుడు నిఘాను పెంచినట్లు చెప్పారు. ఇందుకోసం మూడు ఫ్ౖలయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో రూ.35.37 లక్షల నగదు సీజ్‌ చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ గురువారంతో పూర్తయిందని, నేటి నుంచి గట్టి బందో బస్తును చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 08:48 AM