గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మల్‌రెడ్డి
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:16 AM
గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు తగు కార్యాచరణతో ముందుకు పోతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 12: గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు తగు కార్యాచరణతో ముందుకు పోతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండల పరిధి తుర్కగూడ నుంచి పోచారం మీదుగా కొంగరకలాన్ వరకు పీఎంజీఎ్‌సవై కింద రూ.4.76 కోట్లతో నిర్మాణం చేసిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అలాగే పోచారంలో రూ.19.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.25 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఉప్పరిగూడలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీపీ కృపేష్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ గుర్రం ఇంద్రసేనారెడ్డి, ఎంఈవో కె.వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి వరప్రసాద్‌రెడ్డి తదితరులున్నారు. అంగన్‌వాడీల్లో లబ్ధిదారులకు సంబంధించి మెడికల్ కిట్లను ఎమ్మెల్యే మల్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రత్యేక సందర్భాల్లో అంగన్‌వాడీ టీచర్లు వేసుకునే యూనిఫాంను కూడా అందజేశారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో జి.శాంతిశ్రీ, మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ బర్ల మంగ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు తులసి, పల్లవి, సరళ, కల్పన, సత్యమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.