గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:59 PM
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని లేమామిడిలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, బొదునంపల్లిలో సీసీ రోడ్డు, పాఠశాల ప్రహరీ, అల్వాలలో సీసీ రోడ్డు, సంగెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కేశంపేట, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని లేమామిడిలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, బొదునంపల్లిలో సీసీ రోడ్డు, పాఠశాల ప్రహరీ, అల్వాలలో సీసీ రోడ్డు, సంగెంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ జడ్పీటీసీ విశాలశ్రవణ్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గూడ వీరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, శ్రీధర్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, అనుమగళ్ల రమేష్, కరుణాకర్‌రెడ్డి, అబ్బి సుందరయ్య, సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి
షాద్‌నగర్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గందె సురే్‌షను సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన నివాసంలో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తాను ఎల్లవేళలా ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, సమస్యలపై సంఘటితంగా పోరాడాలన్నారు. గందె సురేష్ మాట్లాడుతూ తామంతా షాద్‌నగర్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, గజవాడ వెంకటేష్, బెజుగం రమేష్, పెద్ది రామ్మోహన్, యంసాని శ్రీనివాస్, మలిపెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.