ఫాతిమాపూర్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:07 AM
పవిత్ర ప్రార్థన మందిరంగా వెలుగొందుతున్న ఫాతిమాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి
కొత్తూర్, జూలై 7: పవిత్ర ప్రార్థన మందిరంగా వెలుగొందుతున్న ఫాతిమాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కొత్తూర్ మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్‌కు చెందిన ఫాతిమా మాత చర్చి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీని శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఫాతిమాపూర్‌లో సీసీ రోడ్లు, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణాలను తన నిధులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమస్యలు తన దృష్టికి తీసుకవస్తే పరిష్కారించేందుకు కృషి చేస్తానన్నారు. తనను సన్మానించిన చర్చి కమిటీ, గ్రామస్తులకు నవీన్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, మాజీ ఎంపీటీసీ జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, కడెంపల్లి శ్రీనివాస్, కళ్లెం నర్సింహారెడ్డి, మెండె కృష్ణ, చర్చి ఫాదర్ సైమన్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు అల్వీన్‌రెడ్డి, చర్చి కమిటీ సభ్యులు దిలీ్‌పరెడ్డి, లుర్దూరెడ్డి, మర్రెడ్డి, సుధాకర్‌రెడ్డి, యాగరెడ్డి, బాలశౌరిరెడ్డి, సామ్‌సన్‌రెడ్డి, ఆరోగ్యరెడ్డి, కె.లుర్దూరెడ్డి, జోస్‌పరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.