Share News

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:08 AM

పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి అన్నారు. తలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీఐ ప్రమోద్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌తో సమావేశమై కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
గౌరవ వందన స్వీకరిస్తున్న ఏసీపీ రంగస్వామి

తలకొండపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి అన్నారు. తలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌ను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీఐ ప్రమోద్‌కుమార్‌, ఎస్సై శ్రీకాంత్‌తో సమావేశమై కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. దొంగతనాల నిర్మూలనకు గ్రామాలు, దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆమనగల్లు సీఐ బి.ప్రమోద్‌కుమార్‌, కడ్తాల్‌ సీఐ శివప్రసాద్‌, తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:08 AM