Share News

నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:33 PM

ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజీవ్‌ చబ్రా తెలిపారు.

నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలి
ఆర్డీవో కార్యాలయ సందర్శనలో రాజీవ్‌ చబ్రా

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25: ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజీవ్‌ చబ్రా తెలిపారు. వికారాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి వికారాబాద్‌ నియోజకవర్గం అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ ఎన్నికల సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. అభ్యర్థులు వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గం అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చేపడుతున్న వివిధ అంశాలపై అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ వ్యయ పరిశీలకులకు వివరించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల సందర్శనలో జిల్లా పరిషత్‌ సీఈవో సుధీర్‌, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

డబ్బు, మద్యం సరిహద్దులు దాటొద్దు

తాండూరు రూరల్‌: పార్లమెంటు ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత మధ్య పూర్తిచేయాలని పార్లమెంటు ఎన్నికల పరిశీలకులు రాజీవ్‌ చబ్రా ఆదేశించారు.ఆయన తాండూరు నియోజకవర్గ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులను ఆయన సందర్శించారు. తాండూరు మండల పరిధిలోని కొత్లాపూర్‌ చెక్‌పోస్టు, యాలాల, మండలం లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో చెక్‌పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ తారాసింగ్‌, తాండూరు రూరల్‌ సీఐ అశోక్‌, కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:33 PM