Share News

డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:58 PM

డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు 2వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాలని కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాలకు చెందిన అభ్యర్థులు బి.నర్సింహారెడ్డి, శైలకుమారి, ఎన్‌.నర్సింహులు తదితరులు కోరారు.

డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇప్పించాలి
కొడంగల్‌: కడా ప్రత్యేకాధికారి కె.వెంకట్‌రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు

కొడంగల్‌, జనవరి 12: డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు 2వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాలని కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాలకు చెందిన అభ్యర్థులు బి.నర్సింహారెడ్డి, శైలకుమారి, ఎన్‌.నర్సింహులు తదితరులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి రాసిన వినతి పత్రాన్ని శుక్రవారం కొడంగల్‌ క్యాంపు కార్యాలయంలో కొడంగల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ ప్రత్యేకాధికారి కుంచాల వెంకట్‌రెడ్డికి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ 1998లో ఉపాధ్యాయ నియామకాల్లో అధికారులు చాలా అవకతవకలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల నియామకం చేయకుండా అక్రమ మార్గాల ద్వారా కొంత మంది నాన్‌లోకల్‌ అభ్యర్థులను నియమించారని ఆరోపించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ డీఎస్సీ 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు 4567 మందికి యంటీయస్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jan 12 , 2024 | 11:58 PM