Share News

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:12 AM

మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దని ఎంపీపీ అనితాగౌడ్‌ అఽధికారులకు సూచించారు.

తాగునీటి సమస్య లేకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనితాగౌడ్‌

తాండూరు రూరల్‌, ఏప్రిల్‌ 15: మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య రానివ్వొద్దని ఎంపీపీ అనితాగౌడ్‌ అఽధికారులకు సూచించారు. తాండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం తాండూరు ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితాగౌడ్‌ మాట్లాడుతూ వేసవి సమయంలో గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారించాలన్నారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అత్యవసరమైతే తాగునీటి ఎద్దడి నివారణ కోసం డీఎంఎ్‌ఫటీ నిధుల ద్వారా బోర్లు తవ్వించాలని కోరారు. పాఠశాలల మరమ్మతులకు కలెక్టర్‌ రూ.2కోట్ల 32లక్షలు మంజూరు చేశారని చెప్పారు. వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకందార్లు గొర్రెల కోసం కట్టిన డీడీలు వాపస్‌ ఇప్పించాలని పశువైద్యాధికారి నిజానంద్‌ను సభ్యులు కోరారు. ఐనెల్లిలో స్త్రీనిధి రుణాలు రూ.18లక్షల గోల్‌మాల్‌పై విచారణ జరిపించాలని ఏపీఎం ఆనంద్‌ను పీఏసీఎస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌ కోరారు. మహిళలకు రుణాలు ఇచ్చే క్రమంలో సంఘం లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని కరన్‌కోట్‌ ఎంపీటీసీ సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేలోపు దాదాపు మూడుసార్లు కరెంటు పోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ కోతలు అధికమయ్యాయని కో-ఆప్షన్‌ సభ్యుడు శంషొద్దీన్‌ అన్నారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ స్వరూపారెడ్డి, ఎంపీడీవో విశ్వప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రమేష్‌, విద్యుత్‌శాఖ ఏఈ కేవీ నాయుడు, మిషన్‌భగీరథ ఏఈలు ప్రణీత్‌, ప్రతిభ, ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జున్‌, ఎంపీటీసీ, ప్రత్యేకాధికారులుపాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:12 AM