ఇంటింటికి గోనె సంచుల పంపిణీ
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:29 AM
కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని అంగడి బజార్‌లో మహిళలకు బ్యాగులను చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి సోదరి మీరాకుమారి ఆదివారం పంపిణీ చేశారు.
కులకచర్ల, మార్చి 3: కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని అంగడి బజార్‌లో మహిళలకు బ్యాగులను చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి సోదరి మీరాకుమారి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిర్మూంచాలనే లక్ష్యంతో గోనే సంచులను ప్రతీ ఇంటికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదె మహిపాల్, శ్రీనివాస్, సిహెచ్ హనుమంతు, నర్సింహారెడ్డి, శ్రీశైలం, ఆంజనేయులు, కేవీఆర్ ఫౌండేషన్ పరిగి నియోజకవర్గ ఇంచార్జ్ రామచంద్రయ్య, బైరం నరేశ్, మాల అనంతయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.