Share News

కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:02 AM

మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయందంటున్న కాంగ్రెస్‌ నాయకుల మాయమాటలు నమ్మొద్దని, ఒకరిద్ధరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎ్‌సకు ఏమీ నష్టం లేదని, చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మొద్దు

మహేశ్వరం, ఏప్రిల్‌ 27 : మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయందంటున్న కాంగ్రెస్‌ నాయకుల మాయమాటలు నమ్మొద్దని, ఒకరిద్ధరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎ్‌సకు ఏమీ నష్టం లేదని, చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం మన్‌సాన్‌పల్లి చౌరస్తాలో జరిగింది. సబితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకొని కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. బీసీ బిడ్డ కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, మెజార్టీ కోసమే పనిచేయాలని కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేశారు. రాజునాయక్‌, మల్లే్‌షయాదవ్‌, నర్సింహ, చంద్రయ్య, రమేష్‌, రవి, చంద్రశేఖర్‌రెడ్డి, రామ్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:02 AM