Share News

కళాశాల నిర్మాణానికి భూరి విరాళం

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:50 PM

దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి శుక్రవారం శతాబ్ది టౌన్‌షిప్‌ అధినేత శ్రీనివా్‌సరెడ్డి రూ.11లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు అందజేశారు.

కళాశాల నిర్మాణానికి భూరి విరాళం
ఎమ్మెల్యే శంకర్‌కు చెక్కు ఇస్తున్న శ్రీనివా్‌సరెడ్డి

షాద్‌నగర్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): దాతల సహకారంతో నిర్మిస్తున్న షాద్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి శుక్రవారం శతాబ్ది టౌన్‌షిప్‌ అధినేత శ్రీనివా్‌సరెడ్డి రూ.11లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు అందజేశారు. తాను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలోనే ఇంటర్‌ విద్యను పూర్తిచేసానని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న కళాశాలను ఎమ్మెల్యే శంకర్‌ దాతల సహకారంతో కార్పొరేట్‌ స్థాయిలో నిర్మాణం చేపడుతుండటం హర్షణీయమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated Date - Dec 27 , 2024 | 11:50 PM