Share News

బాలుడిపై కుక్కల దాడి

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:44 PM

పెద్దేముల్‌లో వీధికుక్కలు దాడిచేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.

బాలుడిపై కుక్కల దాడి

పెద్దేముల్‌, ఫిబ్రవరి 12: పెద్దేముల్‌లో వీధికుక్కలు దాడిచేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. మండల కేంద్రానికి చెందిన కోళ్ళ శ్రీనివాస్‌ కుమారుడు అబ్నేర్‌(6 సంవత్సరాలు) సోమవారం ఇంట్లో నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. వీధిలో బాలుడు ఆడుకుంటున్న సమయంలో కుక్కలు దాడిచేశాయి. దీంతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. బాలుడిపై దాడిచేస్తున్న కుక్కలను కర్రలతో తరిమివేశారు. బాలుడిని కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. గ్రామంలో చికెన్‌, మటన్‌ వ్యర్థాలను వ్యాపారస్థులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పారేస్తున్నారు. వాటికోసం వీధికుక్కలు గుంపులు గుంపులుగా గ్రామంలో తిరుగుతున్నాయి. వీధిలో ఒంటరిగా కనిపించిన పిల్లలపై దాడిచేస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి దాడులు అనేకం జరిగాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:44 PM