ఆలయాన్ని తొలగించొద్దు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:53 PM
మహిమాన్వితమైన పురాతన ఆలయాన్ని తొలగించొద్దని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

కీసర రూరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహిమాన్వితమైన పురాతన ఆలయాన్ని తొలగించొద్దని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నాగారం మున్సిపాలిటీ కమిషనర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ రోడ్డు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చెర్లపల్లి నుంచి కరీంగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణలో భాగంగా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి నుంచి చెరపల్లికి వెళ్లే దారిలో అడ్డాగు వద్ద శ్రీరామాంజనేయ ఆలయం ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని తొలగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయ తొలగింపు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ తొలగింపు చర్యను విరమించుకోవాలని అధికారులను కోరారు. ఆలయాన్ని తొలగించకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేసారు. భక్తుల భక్తి విశ్వాసాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.