నిర్ణీత ధరకంటే ఎక్కువ డబ్బులు తీసుకోవద్దు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:18 AM
గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని పౌర సరఫరాలశాఖ ఎన్‌పోర్స్‌మెంట్ డీటీ మాచణ రఘునంద న్ హెచ్చరించారు.

మాడ్గుల, జనవరి 11 : గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని పౌర సరఫరాలశాఖ ఎన్‌పోర్స్‌మెంట్ డీటీ మాచణ రఘునంద న్ హెచ్చరించారు. మండల కేంద్రంలో ని ఓంకార్ ఇం డేన్ గ్యాస్ ఏజెన్సీని గురువారం తనిఖీ చేశారు. స్టా క్, లైసెన్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ సూదిని శ్రవణ్‌రెడ్డి అందుబాటులో లేనందున ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తే లైసెన్స్‌ను ర ద్దుచేయటమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు. గ్యాస్ సిలిండర్లను హోటళ్లకు సరఫరా చే యెద్దని సూచించారు. డీటీతో హైదర్ అలీఖాన్ ఉన్నారు.