19న చిలుకూరులో గరుడ ప్రసాదం పంపిణీ
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 AM
ఈ నెల 19న శుక్రవారం గరుడ ప్రసా దాన్ని పంపిణీ చేస్తామని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపారు.

మొయునాబాద్ రూరల్, ఏప్రిల్ 2: ఈ నెల 19న శుక్రవారం గరుడ ప్రసా దాన్ని పంపిణీ చేస్తామని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపారు. మంగళవారం ఆలయం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రతి యేటి లాగే ఈ సారి కూడా గరుడ ప్రసాదాన్ని సంతానం కలగని మహిళలకు అందజేస్తామని తెలిపారు. 19న ఉదయం 7 నుంచి 9గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. సంతానం లేని మహిళలు ప్రసాదాన్ని తీసుకోవచ్చని తెలిపారు. మహిళలకు మాత్రమే ప్రసాదం ఇస్తామని రంగరాజన్ చెప్పారు.