Share News

‘అయోధ్య’ అక్షింతల వితరణ

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:25 AM

శ్రీరామ జన్మభూమి(అయోధ్య) అక్షింతల వితరణ కార్యక్రమం చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించారు.

‘అయోధ్య’ అక్షింతల వితరణ
చేవెళ్ల : కౌకుంట్ల గ్రామంలో అక్షింతలకు పూజలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

చేవెళ్ల/ఆమనగల్లు/మంచాల, జనవరి 2 : శ్రీరామ జన్మభూమి(అయోధ్య) అక్షింతల వితరణ కార్యక్రమం చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పిలుపు మేరకు ఆర్‌ఎ్‌సఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి అక్షింతల కలశ వితరణ కార్యక్రమం గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి. కృష్ణారెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి అక్షింతలను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. సర్పంచ్‌ గాయాత్రి, మాజీ ఉప సర్పంచ్‌ మల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నాగార్జున్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ వేంకటేశ్వర్‌రెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని 15వ వార్డు శివాలయ నగర్‌ కాలనీలో మంగళవారం ఇంటింటికీ అయోధ్య అంక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్‌ చెక్కాల లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో అంక్షింతలతో కాలనీలలో ర్యాలీ నిర్వహించారు. శ్రీరామ నామ జపం చేస్తూ ఇంటింటికీ అంక్షింతలను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామాలయం నిర్మించడం దేశానికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో దొంతు సత్యనారాయణ, నారాయణ గౌడ్‌, కోట్ల వెంకటేశ్‌, చలిచీమల పెంటయ్య, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. మంచాల మండలంలో అయోధ్య సీతారాముల వారి అక్షింతల వితరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుట్ల, జాపాల గ్రామాల్లో శ్రీరాములోరి అక్షింతలకు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వాయిద్యాలతో ఊరేగించారు. జాపాలలో జరిగిన కార్యక్రమంలో సంగెం కృష్ణ, చంద్రకాంత్‌, కృష్ణ, పరమేష్‌, సైదులు, శ్రీశైలం, సతీష్‌, ఆరుట్లలో ఉపసర్పంచ్‌ పాండాలజంగయ్య, దండుమధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:25 AM