Share News

బ్రెయిలీ లిపి కనుక్కోవడం గొప్ప విషయం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:04 AM

లూయిస్‌ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకంగా లిపిని కనుక్కోవడం ఎంతో గొప్ప విషయమని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు.

బ్రెయిలీ లిపి కనుక్కోవడం గొప్ప విషయం
దివ్యాంగులతో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

వికారాబాద్‌, జనవరి 4: లూయిస్‌ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకంగా లిపిని కనుక్కోవడం ఎంతో గొప్ప విషయమని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతిని కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపితో ఎంతో మంది దివ్యాంగులు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారని తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30కోట్ల మంది అంధులు బ్రెయిలీ లిపితో అక్షరజ్ఞానాన్ని పొందగలిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్స్‌, జయరాం నాయక్‌, వెంకటేశ్వరమ్మ, కాంతారావు, సీనియర్‌ అసిస్టెంట్‌ జహీరుద్దీన్‌, రాములు, ఎఫ్‌ఆర్‌వో వెంకటేష్‌, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:04 AM