Share News

వ్యక్తి అదృశ్యం

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:44 PM

ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

వ్యక్తి అదృశ్యం

మూడుచింతలపల్లి, సెప్టెంబరు 10: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మూడుచింతలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (36) వెల్డింగ్‌ దుకాణం నిర్వహించుకుంటూ తన భార్య రేణుకతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వెల్డింగ్‌ షాపు నిర్వహణకు నాగరాజు సుమారు రూ.6లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పుల బాధతో మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. వీరి గొడవ పోలీ్‌సస్టేషన్‌ వరకూ వెళ్లగా చివరకు రాజీ కుదుర్చుకున్నారు. అనంతరం గతనెల 24వ తేదీన సుమారు 9గంటలకు బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యుల వద్ద, చుట్టు పక్కల పరిసర ప్రాంతాలు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 07:53 AM