వ్యక్తి అదృశ్యం
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:23 PM
మున్సిపల్ కేంద్రంలోని హుడా కాలనీకి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. కుటుంబికులు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హుడా కాలనీలో నివాసముండే వై. చంద్రయ్య(38) బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను తీసుకురావడానికి జనవరి 6న మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో 7వ తేదీన భార్యకు విషయం చెప్పాడు.
శంషాబాద్, జనవరి 18 : మున్సిపల్ కేంద్రంలోని హుడా కాలనీకి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. కుటుంబికులు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హుడా కాలనీలో నివాసముండే వై. చంద్రయ్య(38) బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను తీసుకురావడానికి జనవరి 6న మహబూబ్‌నగర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో 7వ తేదీన భార్యకు విషయం చెప్పాడు. దాంతో ఆమె ఇరుగుపొరుగు వారిని అడిగి డబ్బులు ఇప్పించింది. అతడు మహబూబ్‌నగర్‌కు వస్తానని చెప్పాడు. ఆ తరువాత ఎంతకూ తన వద్దకు రాకపోవడంతో తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం కనుక్కుంది. ఇంటి వద్ద లేకపోవడంతో కంగారుగా మహబూబ్‌నగర్ నుంచి శంషాబాద్‌కు వచ్చి చంద్రయ్య ఆచూకీ కోసం వెతికింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, అతడు రెడ్ కలర్‌షర్టు, నల్లరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు.