Share News

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : వీర్లపల్లి

ABN , Publish Date - May 03 , 2024 | 12:26 AM

కాంగ్రె్‌సతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి : వీర్లపల్లి

షాద్‌నగర్‌ అర్బన్‌/కొత్తూర్‌/చౌదరిగూడ/షాద్‌నగర్‌రూరల్‌/కేశంపేట/కొందుర్గు, మే 2: కాంగ్రె్‌సతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ చల్లా వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, నాయకులున్నారు. రాష్ట్ర ప్రజలు తిరిగి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని వీర్లపల్లి అన్నారు. కొత్తూర్‌ మండలం మల్లాపూర్‌, మల్లాపూర్‌తండా, గుడితండా, పెద్దగుట్టతండా, మక్తగూడ, గూడూర్‌లో ప్రచారం చేశారు. మాజీఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, కేశంపేట జడ్పీటీసీ విశాలశ్రవణ్‌, మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులున్నారు. వంశీచంద్‌రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే సతీమణి అనురాధలు జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో చౌదరిగూడ మండలం గుంజల్‌పహడ్‌, జాకారం, చేగిరెడ్డి ఘణాపూర్‌లో వంశీచంద్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. షాద్‌నగర్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు హాజరై మాట్లాడారు. వంశీచంద్‌కు మద్దతుగా ఫరూఖ్‌నగర్‌ మండలంలోని వెలిజర్లలో మాజీ ఎంపీటీసీ నర్సింహ్మరెడ్డి ప్రచారం చేశారు. వంశీచంద్‌రెడ్డి గెలుపు ఖాయమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. కొత్తూర్‌ మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. పానుగంటి పర్వతాలు, తదితరులున్నారు. వంశీచంద్‌ను గెలిపించాలని సీనియర్‌ నాయకుడు శ్రీనివా్‌సయాదవ్‌ కేశంపేట మండలం ఎక్లా్‌సఖాన్‌పేటలో ప్రచారం చేశారు. చౌలపల్లిలో మండలాధ్యక్షుడు వీరేశ్‌, కొత్తపేటలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, కొండారెడ్డిపల్లిలో ఆనంద్‌ కుమార్‌, కేశంపేటలో శ్రీధర్‌రెడ్డిలు, ఆశ్లేషారెడ్డి కొందుర్గు మండలం తంగళ్లపల్లి, పర్వతాపూర్‌లో ప్రచారం చేశారు.

Updated Date - May 03 , 2024 | 09:40 AM