Share News

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:00 AM

గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వనంపల్లి, ఎల్కగూడ గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ స్వరూపతో కలిసి వీర్లపల్లి ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
వనంపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

వనంపల్లి, ఎల్కగూడ గ్రామాల్లో పంచాయతీ భవనాల ప్రారంభోత్సం

చౌదరిగూడ, జనవరి 24 : గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వనంపల్లి, ఎల్కగూడ గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ స్వరూపతో కలిసి వీర్లపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమాల్లో సర్పంచులు కవితా గోపాల్‌రెడ్డి, అరుణమ్మ, బాల్‌రాజ్‌, గోపాల్‌, యాదయ్య, ఎంపీటీసీ రజిత, సత్యనారాయణరెడ్డి, మండలాధ్యక్షుడు రాజు, పురుషాత్తంరెడ్డి, జితేందర్‌రెడ్డి, వెంకట్‌నర్సింహరెడ్డి, వేణుగోపాల్‌, అన్వర్‌, మల్లారెడ్డి, మల్లయ్య, సంజీవరెడ్డి, దర్శన్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 12:00 AM