Share News

అయ్యయ్యో!

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:03 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీ చేసిన మొత్తం 43 మంది అభ్యర్థుల్లో ఇద్దరిని మాత్రమే ప్రజలు ఆమోదించారు.

అయ్యయ్యో!

లోక్‌సభ ఎన్నికల్లో పలువురికి డిపాజిట్లు గల్లంతు

చేవెళ్ల బరిలో 43 మంది పోటీ.. 41 మంది అభ్యర్థులకు దక్కని డిపాజిట్‌

మల్కాజిగిరిలో 22మంది పోటీ.. 20 మందికి ధరావత్‌ గల్లంతు

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ’కాసాని’, రాగిడి లక్ష్మారెడ్డితో పాటు డిపాజిట్‌ కోల్పోయిన తెలుగు నటి దాసరి సాహితి

పరాభవంలో 41 మంది స్వతంత్రులు, 20 మంది వివిధ పార్టీల అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీ చేసిన మొత్తం 43 మంది అభ్యర్థుల్లో ఇద్దరికే డిపాజిట్లు దక్కాయి. మిగిలిన 41 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో పాటు 21 మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్నాచితక పార్టీలకు సంబంధించి మరో 20 మంది అభ్యర్థులు ఉన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, వికారాబాద్‌, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 29,39,057 ఓటర్లున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/మేడ్చల్‌, జూన్‌ 6): లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీ చేసిన మొత్తం 43 మంది అభ్యర్థుల్లో ఇద్దరిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 41 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో పాటు 21 మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్నాచితక పార్టీలకు సంబంధించి మరో 20 మంది అభ్యర్థులు ఉన్నారు. చేవెళ్ల లోక్‌ సభ నియోజకవర్గంలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, వికారాబాద్‌, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 29,39,057 ఓటర్లు ఉన్నారు. మేనెల 13వ తేదీనా ఎన్నికలు జరిగాయి. జూన్‌ 4వ తేదీన చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బండారు శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది. 24 రౌండ్లలో జరిగిన ఈ లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి చివరి వరకు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యతను చాటారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈయనకు డిపాజిట్‌ కూడా రాలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తమ డిపాజిట్‌ను కాపాడుకునేందుకు మొత్తం ఓట్లలో 1/6 ఓట్లు పొందాలి. పోలైన ఓట్లలో ఆరో వంతు (16.66) ఓట్లు పొందాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులు, చిన్నచితక పారీల్టు గల్లంతయ్యాయి. 21 మంది అభ్యర్థులకు కేవలం వేయి లోపు ఓట్లు రావడం గమనార్హం.

మల్కాజిగిరిలో ...

మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 22 మంది అభ్యర్థుల్లో ఇద్దరిని మాత్రమే ప్రజలు ఆమోదించారు. మిగిలిన 20 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో పాటు 19 మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్న చితక పార్టీలకు చెందినవారున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్‌, కుత్భుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 39,79,596 ఓటర్లు ఉన్నారు. జూన్‌ 4వ తేదీన కీసరలోని హోళీ మేరీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది. 21 రౌండ్లలో జరిగిన ఈ లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి చివరి వరకు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ఆదిక్యతను చాటారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికు ఘోర పరాభవం ఎదురైంది. లక్ష్మారెడ్డికి 3,00,486 ఓట్లు వచ్చాయి. ఈయనకు డిపాజిట్‌ కూడా రాలేదు.

డిపాజిట్‌ కోల్పోయిన తెలుగు నటి దాసరి సాహితి

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమాని, నటి దాసరి సాహితి ఎన్నికల బరిలో దిగారు. పొలిమేర, పొలిమేర-2 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సాహితీ చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలో పోటీ చేశారు. ఆమెకు 1,938 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్‌ కూడా దక్కలేదు.

Updated Date - Jun 07 , 2024 | 12:03 AM