అక్రమ నిర్మాణాల కూల్చివేత
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:26 AM
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు.

మేడ్చల్ టౌన్, జూన్ 11: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను మంగళవారం మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు శివాలయం రోడ్డుపక్కన నిర్మించిన పలు నిర్మాణాలను టీపీవో రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు.