Share News

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:14 AM

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ అని, ఇక్కడ వయోజన ఓటు హక్కుతో ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతోందని, ప్రలోభాలాకు లోనుకాకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని షాద్‌నగర్‌ ఆర్డీవో వెంకటమాధవరావు పిలుపునిచ్చారు.

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
షాద్‌నగర్‌లో 5కే రన్‌ నిర్వహిస్తున్న ఉద్యోగులు

షాద్‌నగర్‌ అర్బన్‌/చేవెళ్ల, ఏప్రిల్‌ 2: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌ అని, ఇక్కడ వయోజన ఓటు హక్కుతో ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతోందని, ప్రలోభాలాకు లోనుకాకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని షాద్‌నగర్‌ ఆర్డీవో వెంకటమాధవరావు పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ పార్థసారథి ఆధ్వర్యంలో మంగళవారం స్టేడియం నుంచి చౌరస్తా వరకు ఓటు హక్కు వినియోగంపై 5కే రన్‌ నిర్వహించారు. నిజాయితీగా ఓటు వేస్తామని, వేయిస్తామని ప్రతిజ్ఞ చేశా రు. ఆర్డీవో మాట్లాడుతూ ఐదేళ్లు నిజాయితీతో పనిచేసే నాయకులకే ఓటు వేయాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలాకు లొంగకుండా కాకుండా ఓటును వినియోగించుకోవాలని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును పొంది, విధిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కుల, మత, లింగ బేధాలు లేకుండా అందరికీ ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయిధం వంటిదన్నారు. ప్రజలు నిజాయితీగా ఓటు వేయాలని, ఓటు హక్కును దుర్వినియోగం చేయొద్దని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న, తహసీల్దార్లు విజయ్‌కుమార్‌, జగదీశ్వర్‌, రాజేశ్వర్‌, రవీందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఓటు హక్కు ఉన్నవారం తా ఓటును సద్వినియోగం చేసుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పట్టణంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు తమ కు ఇష్టమైన అభ్యర్థికి వేసుకోవాలన్నారు. ఎవరూ ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఓటు ఉన్న వారు తప్పక ఓటు వేయాలన్నారు. ఓటుతోనే మంచి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీడీవో వెంకటయ్య, సీఐ హబీబుల్లాఖాన్‌, మనేజర్‌ అంజన్‌కుమార్‌, ఏపీవో నాగభూషణం, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:14 AM