Share News

ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:04 AM

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రె్‌సతోనే సాధ్యమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. చట్టాలు సమగ్రంగా అమలు కావాలని, ఈ విషయంలో మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
మాట్లాడుతున్న డాక్టర్‌ వెంకటేశ్వర్లు

మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు

సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన సదస్సు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 21 : దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రె్‌సతోనే సాధ్యమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. చట్టాలు సమగ్రంగా అమలు కావాలని, ఈ విషయంలో మేధావులు, విద్యావంతులు ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు. ఇబ్రహీంపట్నంలోని మున్నూరుకాపు సంఘం భవనంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఆదివారం సమాచార హక్కు చట్టం-2005పై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ జీవోను అందరికీ ఆన్‌లైన్‌ ద్వారా ఆర్టీఐ దరఖాస్తులను స్వీకరించడమనేది పారదర్శక పాలనకు నిదర్శనమని వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ స్థాయిలో తీసుకువచ్చిన ఐదు గ్యారంటీ పథకాలు పేద మహిళలు, రైతులు, యువకులు, శ్రామికులు, విభిన్న వర్గాలకు న్యాయం చేకూరేవిగా ఉన్నాయని, రేవంత్‌రెడ్డి పాలనా నిర్ణయాలు చరిత్రాత్మకమని, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకుందామన్నారు. సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యాద కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎంఏ కరీం, సమితి రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఖుర్షీద్‌ పాషా, ఫెడరేషన్‌ హెచ్‌ఆర్సీ అధ్యక్షుడు సురేష్‌, శంకర్‌ రాథోడ్‌, గంట విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:04 AM