Share News

తెలంగాణ మిర్చి ఎగుమతికి డిమాండ్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:24 PM

తెలంగాణలో పండించే సన్న మిర్చి ఎగుమతికి మంచి డిమాండ్‌ ఉందని అమెరికా, కేరళకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు.

తెలంగాణ మిర్చి ఎగుమతికి డిమాండ్‌
మిర్చి పంటను పరిశీలిస్తున్న అమెరికా, కేరళ శాస్త్రవేత్తలు

అమెరికన్‌, కేరళ వ్యవసాయ శాస్త్రవేత్తల వెల్లడి

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన

మాడ్గుల, ఫిబ్రవరి 6: తెలంగాణలో పండించే సన్న మిర్చి ఎగుమతికి మంచి డిమాండ్‌ ఉందని అమెరికా, కేరళకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఓ ప్రైవేట్‌ విత్తన కంపెనీ ఆధ్వర్యంలో మాడ్గుల మండలంలోని ఇర్విన్‌, రామ్‌దుగ్యాల, శాంతిగూడెంలలో రైతులు సాగుచేస్తున్న మిర్చి పంటను మంగళవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. తెలంగాణ భూముల్లో నాణ్యమైన మిర్చి పంట పండిస్తున్నారని విదేశీ, స్వదేశీ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను అభినందించారు. మాడ్గుల మండలం అవురుపల్లి సమీపంలో మిర్చి ఉత్పత్తుల కోసం ఓ కంపెనీని స్థాపిస్తామని తెలిపారు. రైతులు పండించిన మిర్చి పంటను ఆ కంపెనీయే కొనుగోలు చేస్తుందని, మిర్చి పౌడర్‌ను ఇతర రాష్ట్రలకు, దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:25 PM