Share News

కుక్కల దాడిలో జింకకు గాయాలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:02 AM

మండలంలోని పాలబావి తండా సమీపంలో సోమవారం ఉదయం కుక్కలు ఓ జింకను వెంటాడుతుండగా ఆ తండావాసులు గమనించి జింకను బంధించారు.

కుక్కల దాడిలో జింకకు గాయాలు
అధికారులకు జింకను అప్పగించిన తండావాసులు

  • ఫారెస్టు అధికారులకు అప్పగింత

బొంరాస్‌పేట్‌/కొడంగల్‌, జూన్‌ 10: మండలంలోని పాలబావి తండా సమీపంలో సోమవారం ఉదయం కుక్కలు ఓ జింకను వెంటాడుతుండగా ఆ తండావాసులు గమనించి జింకను బంధించారు. అనంతరం కొడంగల్‌ ఫారెస్టు అధికారులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న వికారాబాద్‌ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సూర్యనాయక్‌ తండాకు చేరుకొని బులేరో వాహనంలో జింకకు కొడంగల్‌ ప్రభుత్వ పశువైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం ఫారెస్టు కార్యాలయంలో అకారులకు జింకను అప్పగించారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌నాయక్‌, రాజునాయక్‌, శ్రీనునాయక్‌, సూర్యనాయక్‌, పునిబాయి, చందర్‌నాయక్‌, రమేశ్‌నాయక్‌, దన్ను నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:02 AM