ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వ్యాన్ బోల్తా
ABN , Publish Date - May 24 , 2024 | 11:26 PM
ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వ్యాన్ బోల్తాపడిన సంఘటన శుక్రవారం ఆర్‌జీఐఏ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తప్పిన పెను ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
శంషాబాద్ రూరల్, మే 24 : ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం వ్యాన్ బోల్తాపడిన సంఘటన శుక్రవారం ఆర్‌జీఐఏ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి ట్యూబ్ లోడ్‌తో గచ్చిబౌలి వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. దాంతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని డీసీఎం వ్యాన్‌ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ప్రధాన రోడ్డుపై డీసీఎం బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు ఆలస్యంగా రావడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసులు వచ్చి బోల్తాపడిన డీసీఎం వ్యాన్‌ను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే, డీసీఎం వ్యాన్ బోల్తా పడిన ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.