Share News

గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:28 PM

మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్‌గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి

శంకర్‌పల్లి, జనవరి 18: మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్‌గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:28 PM